: నేపాల్ ను ఈరోజు మరోసారి వణికించిన భూకంపం


సరిగ్గా వారం క్రితం సంభవించిన భారీ భూకంపంతో నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. దాని ధాటికి ఇప్పటి వరకు 6,624 మంది మరణించగా... 14,025 మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఈ ఉదయం మరోసారి నేపాల్ లో భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదయింది. దీంతో, ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని నేపాలీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

  • Loading...

More Telugu News