: ఏపీ ఖాతాలపై తెలంగాణకే అధికారం: హైకోర్టు తీర్పు


ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఇరు రాష్ట్రాలకు చెందిన ఓ వివాదంపై ఆసక్తికర తీర్పునిచ్చింది. ఏపీ ఉన్నత విద్యా శాఖకు చెందిన బ్యాంకు ఖాతాలపై తెలంగాణ ప్రభుత్వానికే అధికారముంటుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు చెప్పింది. ఇందుకు కోర్టు చెప్పిన కారణమేంటో తెలుసా?... ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యాలయం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూమిలో ఉండటమేనట. ఇదివరకే ఈ వ్యవహారంలో తెలంగాణ, ఏపీల మధ్య వాడీవేడీ చర్చ కొనసాగింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు కోర్టుకెక్కగా, కోర్టు తెలంగాణ సర్కారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధివిధానాల ప్రకారం ఇరు రాష్ట్రాలు చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News