: మాస్టారుగా కేసీఆర్... మరికాసేపట్లో పార్టీ కొత్త ఎమ్మెల్యేలకు పాఠాలు!
గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త అవతారం ఎత్తనున్నారు. పార్టీ టికెట్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఆయన పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తనున్నారు. ఈ మేరకు నిన్న రాత్రే నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ చేరుకున్న కేసీఆర్, మరికొద్దిసేపట్లో పాఠాలు బోధించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణా తరగతుల్లో సీఎం కేసీఆర్ తో పాటు సభా వ్యవహారాలు, చట్టాలపై అవగాహన ఉన్న పలువురు నిపుణులు టీఆర్ఎస్ సభ్యులకు పాఠాలు చెప్పనున్నారు.