: ఏపీలో ఇక కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదు: చంద్రబాబు


ఏపీలో ఇక కాంగ్రెస్ పార్టీ అనేదే ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన 'మే'డే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా ప్రసంగించారు. తమ ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. తమ ప్రభుత్వానికి మహిళలే పెద్ద అండ అని, 90లక్షల మంది డ్వాక్రా మహిళలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు. ఏపీ జర్మలిస్టులకు కూడా రూ.5 లక్షల బీమా చేయిస్తామని చంద్రబాబు చెప్పారు. 9 లక్షల మంది డ్రైవర్లకు బీమా కల్పిస్తున్నది ఏపీ ప్రభుత్వమేనని వెల్లడించారు. తమది పేదల ప్రభుత్వమని, ప్రజల సంక్షేమమే తమకు ప్రధానమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News