: అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్ నికోబార్ దీవుల్లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఎలాంటి నష్టం జరగలేదని తెలిసింది. పోర్ట్ బ్లెయిర్ కు 135 కిలో మీటర్ల సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అధికారులు గుర్తించారు.