: మైక్రోమ్యాక్స్ నుంచి 2 ఇన్ 1... టాబ్లెట్ ల్యాప్ టాప్ ధర రూ. 14,999
అటు టాబ్లెట్ గా, ఇటు ల్యాప్ టాప్ గా వినియోగించుకునే వీలుండేలా తయారు చేసిన 'క్యాన్వాస్ ల్యాప్ ట్యాబ్' మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. విండోస్ ఆధారంగా నడిచే ఈ ట్యాబ్, కీబోర్డును అమర్చుకుంటే ల్యాప్ టాప్ గా పనిచేస్తుందని సంస్థ వివరించింది. దీని ధర రూ. 14,999అని, ఈ నెల ఆరవ తేదీ నుంచి ప్రత్యేకంగా ఈ-కామర్స్ వెబ్ సైట్ అమేజాన్ లో లభ్యమవుతాయని ప్రకటించింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే ఈ ల్యాప్ ట్యాబ్ 10.1 అంగుళాల ఐపీఎస్ డిస్ ప్లే, ఇంటెల్ ఆటమ్ ప్రాసెసర్, 2జిబి రామ్, రెండు కెమెరాలతో పాటు విండోస్ 10 వరకూ అప్ గ్రేడ్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగివుంటుందని తెలియజేసింది. 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో లభించే ల్యాప్ ట్యాబ్ 1 టెరా బైట్ల వరకూ క్లౌడ్ స్టోరేజీ సదుపాయం ఉందని, 7,700 ఎంఏహెచ్ బ్యాటరీతో 10 గంటల పాటు నిర్విరామంగా పనిచేస్తుందని పేర్కొంది.