: ఏపీలో స్మార్ట్ నగరాలు ఇవే... తెలంగాణకే ఎక్కువ


దేశంలో 100 స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు నగరాలు కూడా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరు ఈ జాబితాలో ఉన్నాయి. స్మార్ట్ నగరాల జాబితాలో ఉన్న నగరాలను ప్రత్యేక పద్ధతిలో అభివృద్ధి చేస్తారు. వీటికి అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తారు. బడ్జెట్లో కూడా ఈ ప్రాజెక్టుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ భారీ కేటాయింపులు ప్రకటించారు. కాగా, తెలంగాణలో ఐదు నగరాలను 'స్మార్ట్' జాబితాకు ఎంపిక చేశారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ నగరాలు స్మార్ట్ శోభను సంతరించుకోనున్నాయి. ఈ మేరకు కేంద్రం 'స్మార్ట్' జాబితాను ప్రకటించింది. భారత్ లో మెట్రో నగరాలకు దీటుగా ఈ నగరాలు ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష.

  • Loading...

More Telugu News