: రాష్ట్ర కాంగ్రెస్ పై సోనియాకు ఫిర్యాదు చేసిన పాల్వాయి
తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్థన్ రెడ్డి అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రభావవంతంగా పనిచేయడం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన సందర్భంగా రాష్ట్ర నాయకత్వంపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పీజేఆర్ ఆధ్వర్యంలో 26 మంది ఎమ్మెల్యేలున్నా ఆప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాడామని అన్నారు. ఇప్పుడు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వలసబాట పడుతున్నా సీఎల్పీ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే పార్టీని కాపాడుకోవడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.