: విమానాశ్రయంలో ఈసారి ఏకంగా సీలింగ్ కూలిపోయి ఆందోళన పెంచింది


చెన్నై విమానాశ్రయంలో ఎప్పుడు ఏది కూలిపోతుందో తెలీని దుస్థితి నెలకొంది. గతంలో గ్లాస్ ప్యానెల్స్, డోర్స్, పైన రేకులు ఇలా ఏదో ఒకటి కూలనిదే విమానాశ్రయానికి విశ్రాంతి లేదు. తాజాగా విమానాశ్రయం మొదటి అంతస్తులోని సీలింగ్ లో కొంత భాగం కూలి ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. కాగా, ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో ఇప్పటి వరకు ఇలాంటి కూలిపోవడాలు 49 సార్లు జరిగాయని అధికారులు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం సమయంలో జరిగిన పనుల్లో నాణ్యత లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News