: వెంకయ్యనాయుడుకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలి: సీపీఐ
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు సిగ్గు, శరం ఉంటే వెంటనే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేేయాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి కె.రామకృష్ణ ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాలేని వెంకయ్యకు పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు. అమిత్ షా, చంద్రబాబులు ప్రతిపక్షాలు ఉండరాదని భావిస్తుంటే... ప్రతిపక్షంతో పాటు మీడియా కూడా ఉండకూడదని కేసీఆర్ కోరుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ అవినీతిలో కూరుకుపోతోందని... ముడుపుల కోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని ఆరోపించారు.