: హైదరాబాదులో ఏపీ ఎంసెట్ పరీక్షలకు భద్రత కల్పించేందుకు 'నో' చెప్పిన టీఎస్ ప్రభుత్వం


హైదరాబాదులో ఏపీ రాష్ట్రం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షల సెంటర్ల వద్ద తాము భద్రత ఏర్పాటు చేయలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ ఎంసెట్ పరీక్షతో తమకు సంబంధం లేదని, అందువల్ల ఆ పరీక్షలకు భద్రత కల్పించాల్సిన అవసరం తమకు లేదని తెలిపింది. ఎంసెట్ నిర్వహణకు సహకరించాలని గతంలోనే తెలంగాణ విద్యామండలికి ఏపీ విద్యామండలి లేఖ రాసింది. అయితే, టీఎస్ ప్రభుత్వం మొండి వైఖరితోనే ముందుకు వెళుతుండటంతో, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ నరసింహన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని విన్నవించారు.

  • Loading...

More Telugu News