: రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన లేదు, సీబీఐ దర్యాప్తు వేయలేం: శేషాచలం ఎన్ కౌంటర్ పై రాజ్ నాథ్


శేషాచలం ఎన్ కౌంటర్ పై రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని, అందుకే, సీబీఐతో దర్యాప్తు చేయించలేమని స్పష్టం చేశారు. ఎదురు కాల్పులపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని, సుప్రీం మార్గదర్శకాలను ఏపీ సర్కారు పాటించిందని తెలిపారు. ఈ వ్యవహారంలో తమిళనాడు రాజకీయపక్షాలు రాజకీయలబ్ధికి యత్నిస్తున్నాయని అన్నారు. పోలీసుల తప్పుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఎన్ కౌంటర్ పై ఏప్రిల్ 7న మధ్యాహ్నం 12.30కి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని సభకు వివరించారు. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది 'ఎర్ర' దొంగలు హతమవ్వడం తెలిసిందే.

  • Loading...

More Telugu News