: రాందేవ్ బాబా 'మగబిడ్డ ఖాయం' ఔషధంపై రాజ్యసభలో ఆందోళన
ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు చెందిన దివ్య ఫార్మసీ తయారుచేసిన 'పుత్రజీవక్ బీజ్' ఔషధాన్ని నిషేధించాలంటూ విపక్షాలు ఎలుగెత్తాయి. ఈ మందు వాడితే మగబిడ్డే పుడతాడంటూ ప్రచారం చేస్తున్నారని రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఇలాంటి ఔషధాలు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. జేడీ(యూ) సభ్యుడు కేసీ త్యాగి దివ్య ఫార్మసీ నుంచి కొనుగోలు చేసిన పుత్రజీవక్ బీజ్ ప్యాకెట్ ను సభలో ప్రదర్శించారు. హర్యానా బ్రాండ్ అంబాసడార్ (బాబా రాందేవ్) నుంచి ఇలాంటి ఉత్పత్తులు రావడం రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. ఒకవేళ, డైనమిక్ నేత నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనికి అనుమతించిందా? అని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు.