: ఆర్టీసీ కార్మికులకు ఇంక్రిమెంట్ పై తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు
ఆర్టీసీ కార్మికులకు ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింప జేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ ఇంక్రిమెంట్ ను 2014 నుంచి వర్తింపజేయాలని ఎన్ఎంయూ కోరింది. ప్రభుత్వ నిర్ణయంతో 58,700 కార్మికులకు ప్రయోజనం కలగనుంది. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.18 కోట్లు ఖర్చు చేయనుంది. గతేడాది నవంబర్ 29న తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఇంక్రిమెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించి, తాజాగా ఆచరణ రూపంలోకి తేవడం విశేషం.