: నేను బాధితురాలిని కాదు... నువ్వు గెలవలేదు: రేపిస్టుకు విద్యార్థిని బహిరంగ లేఖ


ఆ అమ్మాయి ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ విద్యార్థిని. ఓ రోజు తెల్లవారుఝామున నిర్మానుష్యంగా ఉన్న అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషను నుంచి వస్తూ, ఓ కామాంధుడి కంట పడి అత్యాచారానికి గురైంది. ఈ ఘటన ఈ నెల 11న జరుగగా, అత్యధికుల మాదిరిగా తనలో తాను కుమిలిపోతూ కూర్చోలేదు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా 'నాట్ గిల్టీ' అంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. యూనివర్శిటీ స్టూడెంట్ న్యూస్ పేపర్ 'చీర్ వెల్'లో రేపిస్టును ఉద్దేశించి ఆ విద్యార్థిని బహిరంగ లేఖ రాసింది. తనపై అత్యాచారం తరువాత బాధితురాలిగా మారదలచుకోలేదని, తన ప్రవర్తన మారదని, సంఘంపై తనకున్న అభిప్రాయాలను మార్చుకోబోనని స్పష్టం చేసింది. ఈ ప్రపంచంలో చెడ్డవారికన్నా మంచివారి సంఖ్యే అధికమన్న ఆమె, "ఇది ఒక యుద్ధం, నువ్వు గెలవలేదు" అని వ్యాఖ్యానించింది. ఆమె రాసిన ఈ బహిరంగ లేఖకు ఇతర విద్యార్థులు, నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆమె ప్రారంభించిన 'నాట్ గిల్టీ' ప్రచారంపై 'ది టైమ్స్'లో ప్రత్యేక కథనం వచ్చింది. కాగా, విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ 17 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశామని, మే 6న కోర్టు ఎదుట నిలబెట్టనున్నామని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News