: గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కేసు విచారణ వాయిదా
ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కాంకు సంబంధించిన కేసు విచారణను నేడు హైదరాబాదులోని ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కోర్టు చేపట్టింది. ఈ సందర్భంగా, కేసులో కీలక నిందితులైన పట్టాభి రామారావు, యాదగిరిరావులు కోర్టుకు హాజరయ్యారు. వీరిద్దరూ రూ. 20 వేల షూరిటీని కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.