: రెడ్ స్మగ్లర్ల కొత్త రూటు సూపర్!
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికే స్మగ్లర్లు వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవలంబిస్తున్న నూతన విధానాలను చూసి పోలీసులే అవాక్కవుతున్నారు. తమిళనాడులో రెండు గోడౌన్లపై దాడులు చేసి ఎర్రచందనం దుంగలు పట్టుకున్న పోలీసులకు వచ్చిన అనుమానం ఈ కొత్త రూటు గురించి వారికి తెలిసేలా చేసింది. రెండు గొడౌన్ల మధ్య ఒక ఆటవస్తువులు అమ్మే షాపు ఉంది. పెద్దగా కస్టమర్లు కూడా వచ్చే ప్రాంతం కాకపోవడంతో పోలీసులు అనుమానంతో షాపులో తనిఖీలు చేశారు. ఎర్రచందనం దుంగలతో తయారు చేసిన క్రికెట్ బ్యాట్లు, హాకీ స్టిక్ లు, క్యారమ్ బోర్డులు పెద్దఎత్తున వెలుగుచూడడంతో వారు అవాక్కయ్యారు. వీటిని ఆట వస్తువుల పేరిట విదేశాలకు ఎగుమతి చేస్తుండడం గమనార్హం. ఈ తరహా 'ఎగుమతులు' మరిన్ని ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.