: నేపాల్ ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్
భూకంప ప్రభావంతో అస్తవ్యస్తమైన నేపాల్ ను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. నేపాల్ పునర్నిర్మాణానికి తమ పూర్తి సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ తెలిపారు. నేపాల్ అధికారులతో ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. నేపాల్ భూకంపం విషాదకరమైన సంఘటన అని విచారం వ్యక్తం చేసిన కిమ్, భూకంప బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.