: వైకాపా నేత హత్య కేసులో నిందితుల అరెస్ట్... 13 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు
అనంతపురం జిల్లా రాప్తాడులో నిన్న జరిగిన వైకాపా నేత ప్రసాద్ రెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటలు కూడా గడవక ముందే నిందితులను అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ప్రధాన నిందితుడు ఉప్పర శ్రీనివాసులుతో పాటు అనిల్, అశోక్, రంగనాయుడు ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 13 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాకుండా, అరెస్ట్ చేసిన నిందితులను మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని తెలిపారు.