: ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత... రోడ్ సేఫ్టీ బిల్లుకు నిరసనగా మొదలైన సమ్మె!


రోడ్డు భద్రతా బిల్లును నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె గత అర్ధరాత్రి నుంచే ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. లారీలు రోడ్లపైనే నిలిచిపోగా, ఆటోలు గ్యారేజీ దాటి బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో సమ్మె ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఆర్టీసీ బస్సులను అడ్డుకునేందుకు కార్మిక సంఘాల నేతలు రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసీ డిపోల ముందు ఆందోళనకు దిగారు. బస్సులు రోడ్డెక్కకుండా నిరసన ప్రదర్శనకు యత్నిస్తున్నారు. దీంతో ఆర్టీసీ డిపోల ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News