: రణ్ బీర్ కపూర్, కరణ్ జోహర్, అనుష్కాశర్మ, ప్రీతీజింటా భిక్షాటన
నేపాల్ ను పట్టికుదిపేసిన భారీ భూకంపం మనసున్న వారందరినీ ఏకం చేస్తోంది. ఇలాంటి సమయాల్లోనే ఉదారత అవసరం అంటూ బాలీవుడ్ స్టార్ నటీనటులు నేపాల్ బాధితులను ఆదుకునేందుకు భిక్షాటన నిర్వహిస్తున్నారు. పక్కవాళ్లకు పక్కవాళ్లే సాయం చేయగలరు అనే నినాదంతో బాలీవుడ్ యువహీరో రణ్ బీర్ కపూర్, దర్శకుడు కరణ్ జోహర్, అనుష్కా శర్మ, ప్రీతి జింటా భిక్షాటన ప్రారంభించారు. నేపాల్ బాధితులను ఆదుకునేందుకు కేర్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి స్టార్ ఇండియా అనే సంస్థ చేపట్టిన కార్యక్రమానికి వీరు సాయం అందిస్తున్నారు. అభిమానులు నేరుగా ఈ కార్యక్రమానికి ఆన్ లైన్ ద్వారా విరాళం అందించవచ్చు. లేదా చెక్కులు, డీడీల ద్వారా కూడా విరాళం పంపవచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ మైత్రి కార్యక్రమంతో పాటు ఇది కొనసాగుతుందని వారు వెల్లడించారు.