: నేపాల్ బాధిత ప్రయాణికులపై భారత రైల్వేల కరుణ


నేపాల్ నుంచి భారత్ కు వచ్చే భూకంప బాధితులపై భారత రైల్వేలు కరుణచూపుతున్నాయి. నేపాల్ నుంచి భారత్ లోని స్వస్థలాలకు చేరుకునేందుకు రైల్వేలను ఆశ్రయించేవారి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదని తూర్పు సెంట్రల్ రైల్వే (ఈసీఆర్) నిర్ణయించింది. వారి కోసం జీరో వేల్యూ టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. 7 వేల మంది బాధితులను ఆదుకోనున్నట్టు ఈసీఆర్ జనరల్ మేనేజర్ ఎకే మిట్టల్ తెలిపారు. ఈ టికెట్లను నేపాల్ సరిహద్దు స్టేషన్లు రాజ్సాల్, జయనగర్, సీతామార్చిలలో అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లతో భారత రైల్వేల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News