: భూకంపాలను ముందుగా పసిగట్టలేం, ఆ టెక్నాలజీ ఇంకా రాలేదు: లోక్ సభకు చెప్పిన కేంద్రం
భూకంపాలను ముందే పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం ఇంకా రాలేదని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభకు తెలిపింది. కేంద్ర అణు శక్తి మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... స్పేస్ టెక్నాలజీలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని, కానీ, భూకంపాలను ముందే తెలుసుకునే టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. భూకంపాల రాకను ముందే తెలుసుకోవాలంటే ఎన్నో వాతావరణ మార్పులను విశ్లేషించాల్సి ఉంటుందని వివరించారు. జమ్మూకాశ్మీర్లో వరదలను, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తుపానును ముందే పసిగట్టామని పేర్కొన్నారు.