: ముస్లిం యువతుల కోసం ఏపీ సర్కారు 'దుల్హన్'
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకాలు తీసుకువస్తోంది. వాటిలో 'దుల్హన్' ఒకటి. ఈ పథకం ముస్లిం యువతుల కోసం ఉద్దేశించినది. 'దుల్హన్' పథకం కింద పేద ముస్లిం యువతులకు సాయపడతారు. వారి వివాహాలకు ప్రభుత్వం తరపున ఆర్థికసాయం అందిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకంతో పాటు, పలు కొత్త పథకాలను కూడా ఏపీ సర్కారు ఖరారు చేసింది. వాటిలో టెక్స్ టైల్, ఆటోమొబైల్, అపారెల్, బయోటెక్నాలజీ పాలసీలు కూడా ఉన్నాయి.