: క్షీరదాల మెదడులన్నీ ఒకే తీరుగా పనిచేయవు


వేర్వేరు జంతువులు క్షీరదాల జాతికే చెందినవే అయినప్పటికీ.. ఒకేతీరుగా పనిచేయడం మాత్రం జరగదట. ఒక్కొక్క జంతువుల మెదడు ఒక్కో తీరుగా పనిచేస్తుందిట. అమెరికాలోని బోస్టన్‌, మేరీల్యాండ్‌ యూనివర్సిటీలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని సాధికారికంగా నిరూపించారు. వారు ఎలుకలు మరియు గబ్బిలాలపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. రెండూ క్షీరదాలే అయినప్పటికీ.. ఒకచోటనుంచి మరొక చోటకు వెళ్లేప్పుడు వాటి మెదడులోని కణజాలాల పనితీరు భిన్నంగా ఉంటుందని గుర్తించారు.

వారు గమనించినది ఏంటంటే... ఎలుకల మెదడులోని ఎంటోరినల్‌కార్టెక్స్‌ అనే భాగంలోని కణజాలం కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు థీటా వేవ్స్‌ అనే విద్యుత్తు సంకేతాలను పంపిస్తుంది. గబ్బిలాల మెదడు కణజాలాల్లో ఇలాంటిది ఉండనే ఉండదు. అంటే క్షీరదాల మెదడులు ఒకేరకంగా పనిచేయడం లేదు అన్నది వీరి పరిశీలన. ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని జరిగితే.. మనిషి మెదడు పనితీరు గురించి కూడా మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చునని.. పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన కత్రినా మెక్‌లియోడ్‌ అంటున్నారు.

  • Loading...

More Telugu News