: టీచర్ అవతారమెత్తనున్న కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పినా, ఏది చేసినా సంచలనమే. రాజకీయ ప్రసంగాలతో పార్టీ కార్యకర్తల్లో స్పూర్తి రగిలించిన కేసీఆర్, పార్టీ నేతల్లో పలు విషయాలపై అవగాహన కల్పించేందుకు టీచర్ అవతారమెత్తనున్నారు. మే 1 నుంచి 4 వరకు నాగార్జునసాగర్ లో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉద్యమనేతగా, ముఖ్యమంత్రిగా తన అనుభవాలను పాఠాలుగా ఆయన ప్రజాప్రతినిధులకు బోధించనున్నారు. కేవలం కేసీఆర్ మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కి)కి చెందిన పలువురు నిపుణులు కూడా ఈ శిక్షణా శిబిరంలో బోధించనున్నారు.

  • Loading...

More Telugu News