: ఫుట్ బాల్ ఆడుతూ మైదానంలో కుప్పకూలిన అంతర్జాతీయ ఆటగాడు
ఫుట్ బాల్ ఆడుతూ మైదానంలోనే అంతర్జాతీయ క్రీడాకారుడు కుప్పకూలిపోయిన ఘటన బ్రసెల్స్ లో చోటుచేసుకుంది. బెల్జియం తరపున డిఫెండర్ గా ఆడుతున్న గ్రెగరీ మెర్టెన్స్ మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల తరువాత తీవ్రమైన గుండెనొప్పితో బాధపడుతూ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అతనికి వెంటిలేటర్ పై వైద్యమందిస్తున్నారు. కాగా, అతని పరిస్థితి విషమంగా ఉంది. ఫుట్ బాల్ ఆడడానికి ముందు వైద్యపరీక్షలు నిర్వహించడం మామూలే. అలా నిర్వహించిన వైద్యపరీక్షల్లో గ్రెగరీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలపడం విశేషం!