: మోదీని కలసిన ఎంపీ నాని... ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని
పార్లమెంటు భవన్ కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని విజయవాడ ఎంపీ కేశినేని నాని కలిశారు. టాటా ట్రస్టు మైక్రోప్లానింగ్ ను ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. విజయవాడలోని 264 గ్రామాలను టాటా ట్రస్టు దత్తత తీసుకున్న విషయాన్ని నాని వివరించగా మోదీ అభినందించారు. మిగిలిన ఎంపీలు కూడా నానిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. టాటా ట్రస్టు ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని మోదీ హామీ ఇచ్చారు. ప్రధాని, నానిల సమావేశం దాదాపు 25 నిమిషాల పాటు జరిగింది.