: జడ్జి: నీ మతం ఏంటి?, సల్మాన్: నేను హిందూ ముస్లింను!: కోర్టులో ఆసక్తికర సంభాషణ!


సుమారు 17 సంవత్సరాల క్రితం జోధ్ పూర్ సమీపంలో కృష్ణ జింకలను వేటాడాడన్న ఆరోపణలపై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నేడు కోర్టుకు హాజరయ్యాడు. సల్మాన్ తన వాదనను వినిపించే ముందు న్యాయమూర్తితో ఆసక్తికర సంభాషణ నడిచింది. తొలుత పేరు తదితర వివరాలు స్వయంగా అడిగిన జడ్జి, ఆపై నీ మతం ఏంటి? అని ప్రశ్నించారు. దీనికి సల్మాన్ సమాధానం ఇస్తూ, "నేను భారతీయుడిని, నేనో హిందూ-ముస్లింను. నా తండ్రి ముస్లిం, తల్లి హిందూ" అని చెప్పాడు. ఉదయం 9:50 గంటల సమయంలో తన సోదరి అల్విరా, బాడీగార్డులతో కలసి కోర్టుకు వచ్చిన సల్మాన్ మధ్యాహ్నం వరకూ కోర్టులో గడిపాడు. ఈ కేసులో తనను ఇరికించారని న్యాయమూర్తికి తెలిపాడు.

  • Loading...

More Telugu News