: గజేంద్రది ఆత్మహత్య కాదు... ప్రమాదమని తేల్చిన ఢిల్లీ పోలీసులు!
ఆమ్ ఆద్మీ పార్టీ ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రాజస్ధాన్ రైతు గజేంద్ర సింగ్ ఘటనపై ఢిల్లీ పోలీసులు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గజేంద్ర ఆత్మహత్య చేసుకోలేదని, ఆయన మృతిని ప్రమాదంగానే పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తం చేసిందని కూడా పోలీసులు చెబుతున్నారు. రైతు సమస్యలపై గళమెత్తిన ఆప్ ర్యాలీలో భాగంగా చెట్టెక్కిన గజేంద్ర, సకాలంలో స్పందించలేకపోయిన కారణంగానే మృత్యువాతపడ్డారని పేర్కొంటున్నారు. చెట్టు కొమ్మపై నిలబడ్డ గజేంద్ర సకాలంలో మేల్కొనలేకపోయిన కారణంగా ఆయన మెడకు చుట్టుకున్న కండువా ఉరితాడుగా మారిందని తేల్చారు.