: మే 1న టీటీడీ బాధ్యతలు చేపట్టనున్న చదలవాడ
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చదలవాడ కృష్ణమూర్తి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడంతోనే నూతన బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అటు పాలకమండలి సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారని ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మీడియాకు తెలిపారు. చైర్మన్ చదలవాడ సహా మొత్తం 18 మంది సభ్యులు టీటీడీ పాలకమండలిలో నియమితులయ్యారు.