: నిఘా నీడలో ప్రారంభమైన పీజీ మెడికల్ కౌన్సెలింగ్


ఈ విద్యా సంవత్సరానికిగాను పీజీ మెడికల్ తొలి విడత కౌన్సెలింగ్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రారంభమైంది. మార్చి 1న జరిగిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 8,992 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో 1,193 సీట్లు నాన్ సర్వీస్ అభ్యర్థులకు, 667 సీట్లు సర్వీస్ అభ్యర్థులకు కేటయిస్తున్నారు. తొలిరోజు కౌన్సెలింగ్ కు 800 ర్యాంకుల వరకు అభ్యర్థులను ఆహ్వానించారు. రెండు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కు హాజరు అవుతుండటంతో, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా నిఘా ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి... కౌన్సెలింగ్ ప్రక్రియను రికార్డ్ చేస్తున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News