: నా ఆత్మహత్యకు ప్రధాని కారణమంటూ సూసైడ్ నోట్... రాజీనామా చేసిన దక్షిణ కొరియా ప్రధాని


తన ఆత్మహత్యకు కారణమైన వారిలో ప్రధాని కూడా ఒకరని పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి... తనువు చాలించాడు ఓ వ్యక్తి. సంచలనం రేపిన ఈ ఉదంతం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, కొరియాలోని ఓ నిర్మాణ సంస్థ దివాళా తీయడంతో, ఆ సంస్థ అధినేత సంగ్ వాన్ జోంగ్ కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో, తీవ్ర ఆవేదనకు లోనైన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తనువు చాలించే ముందు ఆయన ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు. అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో వివరించారు. అంతేకాకుండా, తన ఆత్మహత్యకు ఎనిమిది మంది కారణమని... వారిలో ప్రధాని లీవాన్ కూడా ఒకరని పేర్కొన్నారు. తన సంస్థ తరపున ప్రధాని సహా ఎనిమిది మందికి భారీగా లంచాలు ముట్టజెప్పామని తెలిపారు. ఈ ఘటన కొరియాలో సంచలనం రేపింది. ప్రధాని రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రధాని లీవాన్ రాజీనామా చేశారు. వెంటనే ఆయన రాజీనామాను ఆ దేశ అధ్యక్షురాలు ఆమోదించడం కూడా జరిగిపోయింది. అయితే, తాను లంచం తీసుకోలేదని ప్రధాని చెబుతుండటం కొసమెరుపు.

  • Loading...

More Telugu News