: భూకంప బాధితుల పట్ల చలించిపోయిన రామ్ చరణ్... నేపాల్ కు ఔషధాలు


మెగా హీరో రామ్ చరణ్ నేపాల్ భూకంప బాధితుల వెతల పట్ల చలించిపోయారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున ఆయన కూడా నేపాల్ కు సాయం అందించేందుకు రంగంలోకి దిగారు. అపోలో హాస్పిటల్స్ సహకారంతో నేపాల్ కు ఔషధాలు పంపాలని నిర్ణయించారు. భారీ సంఖ్యలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్, దగ్గు మందు తదితర మందులు నేపాల్ కు తరలిస్తారు. నేపాల్ లో భూకంపం సంభవించి రోజులు గడుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడి ప్రజలు ఆహారం లేక అలమటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో అక్కడ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది.

  • Loading...

More Telugu News