: ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ తరువాత మోదీ
సామాజిక అనుసంధాన వెబ్ సైట్ ట్విట్టర్ లో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం తెలిసిన మోదీ, అగ్రస్థానం దిశగా సాగిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాధినేతల్లో 5,69,33,515 మంది ఫాలోయర్లతో బరాక్ ఒబామా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, తరువాతి స్థానంలో 1,95,80,910 మంది ఫాలోయర్లతో క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ద్వితీయ స్థానంలో ఉన్నారు. 1,09,02,510 మంది ఫాలోయర్లతో ప్రధాని మోదీ తృతీయ స్థానంలో నిలిచారు. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు కూడా భారీ సంఖ్యలోనే ఫాలోయర్లు ఉండడం విశేషం.