: బాలీవుడ్ సినిమా యూనిట్ సభ్యులు నేపాల్ లో దుర్మరణం!
నేపాల్ భూకంపం బాలీవుడ్ సినిమా యూనిట్ సభ్యులను కూడా పొట్టనబెట్టుకుందున్న విషయం ఆలస్యంగా వెల్లడైంది. నటి ముగ్ధా గాడ్సే, రస్లాన్ ముంతాజ్ నటిస్తున్న చిత్రానికి సంబంధించి షూటింగ్ నేపాల్ లో నిర్వహించారు. తమ పార్ట్ పూర్తి చేసుకున్న అనంతరం ముగ్ధా, రస్లాన్ భారత్ తిరిగొచ్చారు. మిగతా సభ్యులు షూటింగ్ కొనసాగిస్తూ నేపాల్ లోనే ఉండిపోయారు. అయితే, భూకంపం ధాటికి ఆ యూనిట్ లోని ఎనిమిది మంది ప్రాణాలు విడిచారట. ముగ్ధా దీని గురించి ట్విట్టర్ లో పేర్కొంది. వారి ఆత్మకు శాంతి కలగాలని పేర్కొంది. చాలా దిగ్భ్రాంతికరమైన విషయమని పేర్కొంది.