: బాబు గారూ థ్యాంక్యూ... చంద్రబాబుతో టీటీడీ చైర్మన్ చదలవాడ భేటీ!


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి చైర్మన్ గా ఎంపికైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. నేటి ఉదయం సచివాలయానికి వచ్చిన చదలవాడ, నేరుగా చంద్రబాబు చాంబర్ కు వెళ్లారు. మొన్నటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమైన చదలవాడకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పిన చంద్రబాబు హామీతో నాడు తిరుపతి టెకెట్ ను చదలవాడ, వెంకటరమణకు వదిలేసిన సంగతి తెలిసిందే. నాడు ఇచ్చిన హామీ మేరకు చదలవాడను చంద్రబాబు టీడీపీ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు నిన్న అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో మాట నిలుపుకున్న చంద్రబాబుకు నేటి భేటీలో చదలవాడ కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News