: తల్లి ఒడికి చేరిన 'అమరవీర పుత్ర'


సిమీ తీవ్రవాదులతో జరిగిన పోరులో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కన్నుమూసిన అమరవీరుడు ఎస్సై సిద్ధయ్య కుమారుడు 20 రోజుల చికిత్స తరువాత అమ్మ ఒడికి చేరాడు. పుట్టుకతోనే అన్న వాహికకు రంధ్రం, ఉపిరితిత్తుల సమస్యతో జన్మించిన చిన్నారి ఆరోగ్యం పూర్తిగా మెరుగవడంతో కన్న తల్లి ధరణీషకు అప్పగించారు. బిడ్డను ఒడిలోకి తీసుకుని ఆ తల్లి ఉద్వేగానికి గురయ్యారు. బాలుడి ఆరోగ్యం సంతృప్తికరంగా ఉండడంతో రెయిన్‌ బో ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. తీవ్రగాయాలతో సిద్ధయ్య ఆసుపత్రిలో చేరిన రోజే, ఆయన భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News