: ఆ సినిమా తీయబట్టే ఈ పదవి: దర్శకేంద్రుడు
సుమారు 20 సంవత్సరాల క్రితం 'అన్నమయ్య' చిత్రం తీశాను కాబట్టే శ్రీవారి కృపతో తనకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పనిచేసే అవకాశం లభించిందని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు. టీటీడీ సభ్యుడిగా నియమితుడైన ఆయన, ఈ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, శ్రీవెంకటేశ్వర స్వామి భక్తులకు సేవ చేస్తానని ఆయన అన్నారు. ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు.