: ఫస్ట్ బెంచీకి మారిన హరీశ్... చాకులాగా పనిచేస్తున్నాడంటూ కేసీఆర్ కితాబు!
టీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న మంత్రి హరీశ్ రావు స్థానం బ్యాక్ బెంచీ నుంచి ఫస్ట్ బెంచీకి మారింది. మొన్నటి ప్లీనరీలో హరీశ్ రావు మూడో వరుసలో కూర్చోవడంపై పెద్ద దుమారమే రేగింది. అయితే నిన్నటి పార్టీ బహిరంగ సభా వేదికపై హరీశ్ రావు ముందు వరుసలో ఆసీనులయ్యారు. అంతేకాదండోయ్, పార్టీ అధినేత కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ తో ముచ్చటిస్తూ కనిపించారు. ఇక ప్లీనరీ ప్రసంగంలో హరీశ్ రావు పేరును అంతగా ప్రస్తావించని కేసీఆర్, పార్టీ బహిరంగ సభలో మాత్రం ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘హరీశ్ రావు చాకులాగా పనిచేస్తున్నాడు’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.