: నేపాల్ మృతుల సంఖ్య 15 వేలు దాటొచ్చు: రెస్క్యూ బృందాలు


నేపాల్ లో సంభవించిన పెను భూకంపంలో చిక్కుకుని మృత్యువాత పడిన వారి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. సహాయ బృందాలు శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా ఇప్పటి వరకు 25 శాతం శిథిలాలు కూడా తొలగించలేదని సహాయక బృందాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య 15వేలు దాటే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నేపాల్ లో సమాచార వ్యవస్థతో పాటు రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతినడంతో సహాయక బృందాలు కొండ ప్రాంతాలను చేరుకోలేదు. దీంతో గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకోవడం మరింత కష్టంగా మారింది.

  • Loading...

More Telugu News