: మందు చాల్లేదంటూ ఎయిరిండియా విమానంలో తాగుబోతు వీరంగం


ఆదివారం రాత్రి రియాద్ నుంచి కాలికట్ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ తాగుబోతు ప్రయాణికుడు వీరంగం వేశాడు. తనకు మద్యం సరిపోలేదని, ఇంకా సరఫరా చేయాలని కోరిన ఆ ప్రయాణికుడు ఆపై రెచ్చిపోయాడు. థాటేత్తిల్ నిజేశ్ అనే వ్యక్తి మోతాదుకు మించి మద్యం తాగడంతో, అతను కోరినట్టుగా అదనపు మద్యం తెచ్చేందుకు విమాన సిబ్బంది నిరాకరించారు. దీంతో, ఆ ప్రయాణికుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే క్యాబిన్లో సీట్లు చించివేసి, నానాయాగీ చేశాడు. మందు ఎక్కువైంది, ఇక తాగొద్దని సిబ్బంది ఎంత చెప్పినా ఆ మందుబాబు తలకెక్కలేదట. మద్యం కావాల్సిందేనంటూ గొడవ చేసి, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించాడు. ఫ్లయిట్ అటెండెంట్లపైనా, తోటి ప్రయాణికులపైనా దాడికి యత్నించాడు. అప్పటికి విమానం గాల్లోనే ఉంది. కాలికట్ చేరుకున్న తర్వాత సిబ్బంది ఆ తాగుబోతును సీఐఎస్ఎఫ్ కి అప్పగించగా, వారు స్థానిక పోలీసులకు అప్పగించారు.

  • Loading...

More Telugu News