: పాఠ్యాంశంగా మల్లి మస్తాన్ బాబు జీవిత చరిత్ర


పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు జీవిత చరిత్ర పాఠ్యాంశంగా రాబోతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో అతని జీవితచరిత్రను చేర్చబోతున్నట్టు మంత్రి రావెల కిశోర్ బాబు వెల్లడించారు. హైదరాబాదులో ఈరోజు ఐటీడీఏ సమీక్ష నిర్వహించిన మంత్రి తరువాత మీడియాతో మాట్లాడారు. మస్తాన్ బాబు జీవితం అనేకమందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. "పర్వతారోహణను మస్తాన్ బాబు తన కెరీర్ గా ఎలా మలచుకున్నాడన్న విషయాన్ని భవిష్యత్ తరాలు, ప్రధానంగా విద్యార్థులు తెలుసుకుంటారు. అతను దేశం గర్వించేదగ్గ వ్యక్తి" అని మంత్రి రావెల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News