: ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ బెటర్: ఆంధ్రాబ్యాంక్ సీఎండీ


బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణ ప్రభుత్వం ముందుందని ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ తెలిపారు. గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం బ్యాంకు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హార్టికల్చర్ స్వయం సహాయక బృందాలకు ఏపీ మొండిచేయి చూపిందని, ఇప్పటివరకూ హామీ ఇచ్చిన రుణాల మొత్తం కూడా చెల్లించలేదని అన్నారు. క్యూ-4లో బ్యాంకు నెట్ ప్రాఫిట్ 110 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 185 కోట్లకు పెరిగిందని రాజేంద్రన్ తెలియజేశారు. వడ్డీల రూపంలో వచ్చిన నికరాదాయం 44.4 శాతం పెరిగి రూ. 1,371.2 కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు. ఇతర ఆదాయం 30 శాతం పెరిగి రూ. 437.40 కోట్లకు, నిర్వహణా లాభాలు 18 శాతం వృద్ధితో రూ. 1,002.96 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News