: మే 15 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం


ఏపీలో మే 15నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకురాబోతున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇందుకోసం నూతన మద్యం విధానంపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. మే 4, 5 తేదీల్లో అధికారులతో కలసి కేరళ వెళ్లి అక్కడ అమలు చేస్తున్న మద్యం విధానాన్ని అధ్యయనం చేయనున్నట్టు మంత్రి వివరించారు. నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,308 మద్యం దుకాణాలున్నాయి. ప్రభుత్వమే వాటిని నిర్వహించడంవల్ల 20వేల మందికి ఉపాధి కల్పించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News