: దేశీ ఆవులను చంపొద్దన్నారు... విదేశీ ఆవులను దయ్యాలంటున్నారు!


దేశంలో గోవధ నిషేధంపై గట్టిగా పట్టుబడుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఇప్పుడు విదేశీ ఆవులపై స్పందించింది. అఖిల భారతీయ గో సేవా సంస్థ అధ్యక్షుడు శంకర్ లాల్ మాట్లాడుతూ... జెర్సీ ఆవులు దయ్యాలవంటివని, వాటి పాలు తాగితే పిల్లల్లో నేర ప్రవృత్తి పెరుగుతుందని అన్నారు. భారత గోవులు సాత్వికమైనవని, వాటి పాలు తాగితే ఎలాంటి దురాలోచనలు కలగవని చెప్పుకొచ్చారు. జెర్సీ ఆవుల పాలల్లో విష పదార్థాలుంటాయని తెలిపారు. కాగా, భారత్ లోకి బ్రిటీష్ హయాంలో జెర్సీ ఆవులను దిగుమతి చేసుకున్నారు. దేశంలో పాల దిగుబడిని గణనీయంగా పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News