: దేశంలో భూకంపంతో 72 మంది మృతి... లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ ప్రకటన


దేశంలో భూకంపం ప్రభావంతో 72 మంది చనిపోయారని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నేపాల్ భూకంపంపై లోక్ సభలో ప్రకటన సందర్భంగా వెల్లడించారు. సహాయ చర్యల కోసం రాష్ట్రాలను సమన్వయం చేసుకున్నామన్నారు. భూకంపం సమయంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే స్పందించారని, వారికి కేంద్ర ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు చెబుతున్నామని అన్నారు. అటు నేపాల్ లో భూకంపంపై ప్రధాని మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారని సభకు వివరించారు. ఆ దేశానికి పూర్తి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధానే స్వయంగా అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారని రాజ్ నాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News