: షిరిడీ ఆలయ నిర్వహణను టీటీడీకి అప్పగించాలట... ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే డిమాండ్


మరాఠీ ప్రాంతీయాభిమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 'మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన' అధినేత రాజ్ ఠాక్రే సంచలనమైన ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబా ఆలయ బాధ్యతలను ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) అప్పగించాలని ఆయన వాదిస్తున్నారు. ఎందుకంటే, షిరిడీ ఆలయ నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందట. షిరిడీ ఆయల సేవలను, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, షిరిడీ నిర్వహణను టీటీడీకి అప్పగించాలని ఆయన వాదిస్తున్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా టీటీడీ పనిచేస్తోందని ఆయన కితాబు కూడా ఇచ్చారు.

  • Loading...

More Telugu News