: ధోనీకి బైకులంటే పిచ్చి... మరి కోహ్లీకి?


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే పిచ్చి. గతంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల ద్వారా జట్టులో ఎవరికి బైకు లభించినా, దానిపై సదరు విజేతను ఎక్కించుకుని మైదానంలో చక్కర్లు కొడుతూ తెగ సంబరపడేవాడు. ఆ తర్వాత సొంతంగా కాస్ట్ లీ బైకులు కొనుక్కున్న అతడు వీలు దొరికినప్పుడల్లా రాంచీ వీధుల్లో రయ్యిమంటూ తిరిగేస్తాడు. ఇక వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా ఓ పిచ్చి ఉంది. అతడికి సూపర్ కార్లంటే యమా క్రేజట. ఐపీఎల్ లో తన జట్టు సభ్యుడు క్రిస్ గేల్ ను తన కొత్త ఆడి కారులో ఎక్కించుకుని గతంలో ఢిల్లీ మొత్తం చక్కర్లు కొట్టాడు. తాజాగా ఇటీవలే కొత్త లంబోర్ఘిని సూపర్ కారును కోహ్లీ కొనుకున్నాడు. ఈ కారులో బెంగళూరు జట్టులోని మరో సభ్యుడు సీన్ అబాట్ (ఆస్ట్రేలియా)ను కూర్చోబెట్టుకుని అతడు ఢిల్లీ రోడ్లపై దూసుకుపోయాడట.

  • Loading...

More Telugu News