: ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మళ్లీ రంగారెడ్డి జిల్లానే అగ్రస్థానం


తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో మళ్లీ రంగారెడ్డి జిల్లానే 75 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్ధానంలో నిలిచింది. ఇక నల్లొండ జిల్లా 50 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉందని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. గత రెండేళ్ల కంటే ఈసారి ఇంటర్ ఫలితాలు చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. మే 25 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, పరీక్ష ఫీజుకు అఖరు తేదీ మే 6గా నిర్ణయించినట్టు చెప్పారు. ఫెయిలైన విద్యార్థులకు కొన్ని రోజుల ముందుగా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్టు కడియం చెప్పారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుచేసి మూడు వారాలపాటు సంబంధిత సబ్జెక్టులపై శిక్షణ ఇస్తారన్నారు. కాగా మే 1 నుంచి విద్యార్థులకు మార్కుల మెమోను అందజేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News